Advertisement

వకీల్ సాబ్ నిర్మాతలపై ఫిర్యాదు

Posted : May 3, 2021 at 3:20 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై అభ్యంతరం తెలుపుతో ఓ వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడుకున్నారని.. ఓ చోట స్క్రీన్ పై తన ఫోన్ నెంబర్ చూపించారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి తనకు పలువురు ఫోన్లు చేసి విసిగిస్తున్నారని.. కొందరైతే నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడుకున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.

ఇప్పటికే ఈ విషయంపై తన తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు కూడా పంపించినట్టు తెలిపాడు. దీనిపై వారి స్పందన కోసం చూస్తున్నట్టు చెప్పాడు. కాగా, మూడేళ్ల విరామం తర్వాత పవన్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందిలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాను వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. ఏప్రిల్ 9న విడుదలైన సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.


Advertisement

Recent Random Post:

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Posted : March 25, 2024 at 12:14 pm IST by ManaTeluguMovies

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement