ఇటీవలే వకీల్ సాబ్ టీం మెయిన్ స్టార్స్ లేకుండా మిగిలి ఉన్న సీన్స్ కి సంబందించిన షూటింగ్ ని మొదలు పెట్టారు. అంజలి కూడా ఈ షూట్ లో పాల్గొంది. ముఖ్యంగా ఈ ఫైనల్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ మీద వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని షూట్ చేయాల్సి ఉంది. ఆ షూట్ ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై క్లారిటీ లేక దిల్ రాజు చాలా టెన్షన్ లో ఉన్నాడు.
అనుకున్నదాని ప్రకారం అయితే, పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ లపై వచ్చే ఎపిసోడ్స్ ని అక్టోబర్ 26 నుంచి మొదలు పెట్టాలనుకున్నారు, అలాగే నవంబర్ చివరికల్లా ఫినిష్ చేయాలనుకున్నారు. కానీ ఆ షెడ్యూల్స్ లో మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుండడంతో దిల్ రాజు పూర్తి టెన్షన్ లో ఉన్నాడట. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రామిస్ తో దిల్ రాజు రిలాక్స్ అయ్యాడట. అదేమిటంటే.. తన కమిట్ మెంట్స్ ఎన్ని ఉన్నా త్వరలోనే షూట్ మొదలు పెట్టి డిసెంబర్ కల్లా తన షూట్ తో పాటు డబ్బింగ్ కూడా ఫినిష్ చేస్తానని తెలిపాడట.
దాంతో దిల్ రాజు కాస్త రిలాక్స్ అవ్వడమే కాకుండా 2021 సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంజలి, నివేత థామస్ ముఖ్యపాత్రల్లో పోషిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ సినిమాకి రీమేక్.