పవన్ కళ్యాణ్ హీరో పేరు మీద టైటిళ్లు ఉండాలని పట్టుబట్టే హీరో కాదని.. ఇందుకు అతడి కెరీర్లో ఎన్నో ఉదాహరణలున్నాయని.. ఇది మంచి లక్షణం అని పరుచూరి అన్నారు. గతంలో హీరోలు లాయర్ పాత్రలు పోషిస్తే.. వారి లాయర్ పదానికి వారి పేరు కూడా జోడించి టైటిళ్లు పెట్టేవాళ్లని.. లాయర్ విశ్వనాథం లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ అని.. కానీ పవన్ మాత్రం తన పేరు రానివ్వకుండా లాయర్ సాబ్ అని పేరుకు ఒప్పుకోవడం మంచి విషయమని, సాబ్ అని చేర్చడం ద్వారా టైటిల్‌కు ఆకర్షణ తెచ్చారని.. ఇలాంటి టైటిల్ పెట్టాలని సూచించిన వాళ్లను అభినందించాలని పరుచూరి అన్నారు. ఇక పింక్ మహిళల సమస్యల మీద నడిచే కథ అయినా.. దానికి కమర్షియల్ హంగులు జోడిస్తే బాగానే ఉంటుందని.. పవన్ సరసన హీరోయిన్ని పెట్టి మంచి ప్లేస్మెంట్ పాటలు పెట్టినా ఇబ్బంది లేదని.. ఆ పాత్రకు శ్రుతి హాసన్‌ను తీసుకోవాలనుకోవడం కూడా మంచి నిర్ణయమని అన్నారు పరుచూరి.