Advertisement

వంశీ సైకిలెక్కేస్తారా… నిజమేనా.. ?

Posted : March 26, 2022 at 11:04 pm IST by ManaTeluguMovies

విజయవాడ గన్నవరం సీటు నుంచి రెండు సార్లు గెలిచి తన పట్టు నిలుపుకున్న డైనమిక్ నేత వల్లభనేని వంశీ. ఆయన 2019 ఎన్నికల తరువాత టీడీపీని వీడి వైసీపీ నీడను చేరారు. వైసీపీలో తనకు మంచి గౌరవం లభిస్తుంది అని కూడా భావించారు.

ఆ ఊపులో ఆయన జగన్ అండ చూసుకుని తన మిత్రుడు మంత్రి కొడాలి నాని మద్దతు చూసుకుని ఏకంగా చంద్రబాబు చినబాబుల మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక దశలో ఆయన అనుచితమైన కామెంట్స్ చేశారు. అవి కాస్తా వివాదం అయి ఏకంగా పెద్ద దుమారమే చెలరేగింది.

అసెంబ్లీలో కూడా చంద్రబాబు తమ ఫ్యామిలీ మీద కామెంట్స్ చేశారంటూ సభనే బహిష్కరించేశారు. ఇవన్నీ ఇలా ఉంటే వంశీని ఓడించడానికి తగిన క్యాండిడేట్ కోసం ఒక వైపు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ టైం లో బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా ఒక ప్రచారం అయితే సాగుతోంది.

అదేంటి అంటే వంశీ మళ్ళీ సైకిలెక్కేస్తారని ఆయనకు వైసీపీలో గౌరవం లేదని పైగా అక్కడ వర్గ పోరుతో టోటల్ డ్యామేజ్ గా సీన్ మారింది అంటున్నారు. దాంతో ఆయన విషయంలో పార్టీ కూడా పెద్దగా ఆలోచించడంలేదని అంటున్న్నారు.

పైగా టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో గుంటూరుకు చెందిన మద్దాల గిరిని తప్ప ఎవరినీ నమ్మడంలేదని అంటున్నారు. గిరిని ఈ మధ్య పెగాసస్ మీద ప్రభుత్వం వేసిన సభా సంఘంలో కూడా మెంబర్ గా చాన్స్ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తారని అంటున్నారు. ఆయన తప్ప మిగిలిన వారికి వైసీపీలో వర్గ పోరు తలనొప్పి అయితే అధినాయకత్వం కూడా సైలెంట్ గా ఉండడంతో ఇబ్బ్బందిగా మారింది అంటున్నారు.

దాంతో వంశీ తిరిగి సొంత పార్టీకి వెళ్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నారు అని తెలుస్తోంది. మరి టీడీపీ ఆయనకు తీసుకుంటుందా అన్నదే చర్చ. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి వంశీ సహా మిగిలిన వారు టీడీపీకి వస్తే తీసుకుంటారు అని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో. నిజంగా వంశీ వైసీపీని వీడుతారా. కొడాలి నానిని వదిలివెళ్తారా టీడీపీలో చేరుతారా. చేరి ఇమడగలరా. ఇవన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం అంత సులువుగా దొరకవు. వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు..కారణం ఏంటి ? | Record Rainfall And Floods in Dubai ?

Posted : April 18, 2024 at 12:56 pm IST by ManaTeluguMovies

ఎడారి దేశంలో ఎందుకీ వరదలు..కారణం ఏంటి ? | Record Rainfall And Floods in Dubai ?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement