“చాలా ప్రేమతో నేను పీటర్ ను వివాహం చేసుకున్నాను. తను నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నాడు. అయితే తన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. తన వైద్య ఖర్చులు అన్నీ నేనే భరించాను. వైద్యులు కూడా స్మోకింగ్, డ్రింకింగ్ మానేయమని వార్నింగ్ ఇచ్చారు. అయితే తనలో ఎటువంటి మార్పు లేదు. ఇటీవలే కుటుంబంతో కలిసి గోవా వెళ్లాం. ఇలా అయినా తను సాధారణ స్థితికి చేరుకుంటాడని ఆశించాను. అయితే అక్కడ కూడా స్మోకింగ్, డ్రింకింగ్ ను విడిచిపెట్టలేదు. గోవా నుండి చెన్నై దాకా నేను ఒక్కదాన్ని పీటర్, పిల్లలను తీసుకుని కార్ లో ఇంటికొచ్చాను. ఇప్పుడు తన తాగుడు కోసం నిర్మాతలను డబ్బులు అడుగుతున్నాడని తెలిసింది. తనను మార్చడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఈ పోరాటంలో నేను ఓడిపోయానని అనుకుంటున్నాను” అని తెలిపింది వనితా.