ఇక తన తర్వాతి సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు వరుణ్ తేజ్. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఏకధాటిగా నెలన్నర పాటు జరిగే షూటింగ్ లో మెజారిటీ పార్ట్ ను చిత్రీకరిస్తారు. మిగతా 20 శాతాన్ని ఈశాన్య యూరోప్ లో చిత్రీకరిస్తారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ ఎంపికైనట్లు సమాచారం. డాక్టర్ చిత్రంలో విలన్ గా వినయ్ అందరినీ మెప్పించిన విషయం తెల్సిందే.