అయితే ఈ అవరోధాలను దాటుకుంటూ ఈ చిత్ర షూటింగ్ సాఫీగా సాగుతోంది. గని అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం జులై 30న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున ప్రభాస్ రాధే శ్యామ్ కూడా తమ విడుదల తేదీను ప్రకటించడంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కు డేట్ మార్చడం తప్ప మరో అవకాశం లేదు.
ఎందుకంటే రాధే శ్యామ్ భారీ అంచనాల మధ్య వస్తోంది. ఆ చిత్రంతో పోటీకి వెళితే రెవిన్యూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇంకొంచెం ముందుగా జులై 2న వస్తే ఎలా ఉంటుందా అని వరుణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.