ఇక రీసెంట్ గా డబూ రత్నాని కేలండర్ కు హాట్ ఫోజులిచ్చింది విద్యా. థై షో తో పిచ్చెకించింది. ఈ ఫోటోషూట్ అడవిలో జరిగింది. దాంతో పాటు విద్యా లింగ వివక్షపై మాట్లాడింది.
“నా దృష్టిలో ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఆడవాళ్లే వంట చేయాలని ఎక్కడైనా ఉందా? వాళ్ళు మాత్రమే వంటింటికి పరిమితం అవ్వాలా? ఒకసారి అతిధులు మా ఇంటికి వచ్చారు. నీకు వంట రాదు కదా అని నన్ను ప్రశ్నించారు. నాకే కాదు సిద్ధార్థ్ కు కూడా రాదు అని చెప్పాను. నువ్వు వంట నేర్చుకుంటే బాగుంటుంది అన్నారు. అప్పుడు నాకు సిద్ధార్థ్ కు తేడా ఉండాలి కదా అన్నాను. అంతే అవతలి వ్యక్తి నోరు మెదపలేదు” అని గుర్తు చేసుకుంది.