జులై నుండి థియేటర్ల ఓపెన్ ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జులై నెలలోనే మాస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సమయంలో నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్ తమిళనాడు సీఎంకు మాస్టర్ సినిమాకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ కోరుతూ లేక రాయడం జరిగింది. మాస్టర్ సినిమా విడుదల అయితే థియేటర్లలో సామాజిక దూరం సాధ్యం కాదని, భారీ ఎత్తున విజయ్ ఫ్యాన్స్ సినిమాకు హాజరు అవుతారు.
అలా జరిగితే వైరస్ మరింత విజృంభిస్తుంది అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంలో అధికారుల నుండి ఎలాంటి స్పందన అయితే రాలేదు కాని విడుదల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనుకుంటున్నారు. అందుకే ముందస్తుగానే మాస్టర్ నిర్మాతలు సినిమా విడుదలకు అనుమతించాలంటూ సీఎంకు లేఖ రాశారు. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే మాస్టర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
థియేటర్లకు సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తూ సామాజిక దూరంతోనే మాస్టర్ సినిమాను ప్రేక్షకులు చూసేలా చేస్తామంటూ అందులో నిర్మాతలు హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నుండి మాస్టర్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అనేది చూడాలి.