ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తన తర్వాతి సినిమాల విషయంలో హింట్ ఇచ్చిన దేవరకొండ

విజయ్ దేవరకొండ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. తన ఆఖరి మూడు చిత్రాలు ప్లాపులుగా మిగిలినా కూడా విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తన మార్కెట్ అలానే స్థిరంగా ఉండడం విశేషం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేస్తుండడం విశేషం. 40 రోజుల చిత్రీకరణ పూర్తయింది. మరో మూడు నెలల షూటింగ్ చేస్తే ఈ చిత్రం పూర్తవుతుంది. ఈ చిత్రం కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో చిత్రం చేయనున్నానని విజయ్ గతంలో ప్రకటించాడు.

ఇక గత కొన్ని రోజుల నుండి విజయ్ దిల్ రాజు నిర్మాణంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. శివ నిర్వాణ సినిమాను దిల్ రాజు నిర్మించాల్సి ఉండగా విజయ్ చొరవతో శివ సినిమా మైత్రి వాళ్లకు ఇచ్చి, దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దాని ప్రకారమే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయింది.

అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. విజయ్ మాత్రం ఈ కాంబినేషన్ పై హింట్ ఇచ్చాడు. తన పుట్టినరోజున విష్ చేసిన అందరికీ కృతఙ్ఞతలు తెలుపుతూ వచ్చిన విజయ్, ఇంద్రగంటికి కూడా థాంక్స్ చెప్పాడు. దర్శకుడు ఈ సంవత్సరం నువ్వు మరిన్ని అద్భుతాలు చేయాలని ఆకాంక్షించగా, దానికి సమాధానంగా విజయ్.. మీతో చేసే ఒక అద్భుతం గురించి మాత్రం నాకు తెలుసు అంటూ సినిమా గురించి చెప్పకనే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

Exit mobile version