ఈ చిత్రంను పూరి ముంబయి నేపథ్యంలో రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పలు సీన్స్ లో విదేశీ ఫైటర్స్ తో ఫైటింగ్ చేసే సీన్స్ ఉంటాయి. విదేశీ ఫైటర్స్ ఎక్కువ మంది ఈ సినిమాలో నటించాల్సి ఉంది. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల నుండి నటీ నటులను సాంకేతిక నిపుణలను తీసుకు వచ్చి పని చేయించుకునేలా లేదు. ఆ కారణంగానే స్క్రిప్ట్ మార్చి లోకల్ ఫైటర్స్ తోనే ఆ ఫైట్లు పూర్తి చేయాలనే నిర్ణయానికి పూరి వచ్చాడు. అలాగే కొంత భాగం విదేశాల్లో కూడా షూటింగ్ చేయాలనుకున్న పూరి తన నిర్ణయాన్ని మార్చుకుని పూర్తిగా ఇండియాలోనే అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత మంచి జోష్ మీదున్న పూరి ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని మరోసారి తన సత్తా ఏంటో స్టార్ హీరోలకు నిరూపించుకోవాలని తాపత్రయ పడుతున్న సమయంలో ఇలా కరోనా వైరస్ కారణంగా ఆయన ప్లాన్స్ అన్ని కూడా రివర్స్ అయినట్లయ్యింది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇద్దరి కాంబోలో షూటింగ్ కూడా జరిగింది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. పూరి, ఛార్మి, కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్‌తో కూడిన కథాంశంతో సాగుతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాస్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి పూరి రౌడీ స్టార్‌కు సక్సెస్‌ను ఇస్తాడా అనేది చూడాలి.