ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విజయ్ దేవరకొండ తండ్రిగా నటించనున్న బాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తను నటించిన అర్జున్ రెడ్డితో నార్త్ లో కూడా సూపర్ ఫేమ్ ను సాధించాడు. విజయ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైలో త్వరలోనే తిరిగి మొదలుకానుంది.

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో మూడు భాషల్లో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో ఈయన నటిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో సునీల్ శెట్టి పాత్ర ఉంటుందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు చాలా మందే నటిస్తున్నారు అని తెలుస్తోంది. ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫైటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Exit mobile version