వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.