ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విజయ్‌ దేవరకొండ సమ్మర్‌లో మరో సినిమా.

ప్రస్తుతం ‘ఫైటర్‌’ చిత్రం చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. వచ్చే ఏడాది వేసవి నుంచి మరో సినిమాను షురూ చేయాలనుకుంటున్నారని తెలిసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ చేస్తున్న సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కోవిడ్‌ వల్ల ఈ చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. అలానే ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ‘దిల్‌’ రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Exit mobile version