ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ట్రెండ్ అవుతున్న విజయ్ ‘తలనొప్పి’ సినిమా

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ టైమ్ ఎలా నడుస్తుందో అతనికి కూడా అర్థం కావడం లేదు. సిక్స్ కొట్టాలని ఎంతో కష్టపడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతున్నాయి. ఆ తర్వాత అవే సినిమాలు డిజిటల్‌లో రిలీజై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌, లైక్స్‌తో దూసుకుపోతుంటే… ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదలైన మూడురోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘డియర్ కామ్రేడ్’ సంగతి పక్కనబెడితే, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రెండింగ్‌లో నిలవడానికి మాత్రం లాక్‌డౌనే కారణం.

ఫిబ్రవరి 14న విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను క్రిటిక్స్ ఓ ఆటాడేసుకున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓవర్ యాక్షన్, తలనొప్పి తప్ప ఏమీ లేదని తేల్చేశారు. దానికి తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్‌ రిజల్ట్ అందుకున్నాడు ప్రపంచ ప్రసిద్ధ ప్రేమికుడు. అయితే ఏప్రిల్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లల్లో ఖాళీగా ఉండడమే.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు, ఎలా ఉందో చూద్దామని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను ఓపెన్ చేస్తున్నారు. చూసిన తర్వాత మాత్రం ‘వారి దేవుడో తలనొప్పి’ అంటూ ఈ తలలు పట్టుకుంటున్నారట. ఏ మాత్రం కొత్తదనం లేకుండా, మూడు కథలతో మూడేసి సినిమా తీసేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ట్రోల్స్‌‌కి గురవుతున్న సినిమాగా అరుదైన రికార్డు దేవరకొండ చిత్రానికి దక్కింది. ఈ ట్రోల్స్ కూడా ఈ సినిమాలో ఏముందా? అనే కుతుహాలం జనాల్లో రేగడానికి ఓ కారణం.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫ్లాప్ అయిన శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ చాలామందికి నచ్చింది. ఈ ఎపిసోడ్ కోసం విజయ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఓపెన్ చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అలా విజయ్ దేవరకొండ కళా ఖండం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వరల్డ్ ఫేమస్ లవ్వర్ ట్రెండ్ అవ్వడం ఏముందిలే.. స్లోగా సాగుతూ పరమ బోరింగ్ ఉండే కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయంటే.. అసలు జనాలు ఎంత బోర్ ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version