ఇన్ స్టా వేదికగా సెలబ్రేషన్స్ ఫోటోల్ని విజయ్ అభిమానులకు షేర్ చేసాడు. ఇక్కడో ఆసక్తికర సంగతి ఉంది. రష్మి-విజయ్ ఒకే రంగు దుస్తులు ధరించి సెంట్రాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. మోరూన్-గోల్డ్ కలర్ దుస్తులు ధరించి ఇద్దరు సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యారు. ఇలా ఫ్యామిలీ పండుగలో రష్మిక కలవడం ఇదే మొదటిసారి. అయితే సంక్రాంతి పండుగను తెలంగాణలో సెలబ్రేట్ చేయరు. విజయ్ దేవరకొండ తెలంగాణ వాసి. ఆంధ్రాలోనే ఈ పెద్ద పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ విజయ్ ఆంధ్రా వాసి కాకపోయినా రంగుల పండుగను ఘనంగా…రష్మికతో జరుపుకోవడం గమనించదగ్గ విషయం.
గతంలోనే ఇద్దరు లవ్ లో ఉన్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కానీ అది కేవలం ప్రెండ్ షిప్ మాత్రమేనని..అంతకు మించి ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా చోటు చేసుకుంటోన్న సన్నివేశాల నేపథ్యంలో మరోసాలి అలాంటి కథనాలకు దారి తీస్తోంది. ఇక వృత్తి పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు. ఇటీవలే `పుష్ప` సినిమాతో రష్మిక పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉంది. `లైగర్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నాడు.