సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో అలరిస్తూ ఉన్న ఈ అమ్మడు మళ్లీ తాను బిజీ అవుతాననే నమ్మకంతో ఉంది. తాజాగా ఈ అమ్మడు తనకు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. తప్పకుండా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ భారీగా ఉంది. అలాంటి స్టార్‌తో మరి నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుంటుందో చూడాలి.
ఆర్డీఎక్స్ లవ్ అంటూ ఈమె చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడినది. ఆ సినిమా మాత్రమే కాకుండా వెంకీ మామ చిత్రంలో ఈమె పోషించిన పాత్ర విమర్శల పాలయ్యింది. వెంకీ మామ పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా కూడా ఈమెకు మాత్రం ఆ సినిమా ఏమాత్రం మైలేజ్‌ను తీసుకు రాలేక పోయింది. అది మాత్రమే కాకుండా రవితేజతో నటించిన డిస్కో రాజా చిత్రం కూడా ఈమెకు నిరాశ పర్చింది.