విజయ్ ప్రకటించిన పాతిక లక్షలకు మరో 27లక్షలకు పైగా డొనేషన్లు ఇప్పటికి వచ్చి పడ్డాయి. కానీ ఇప్పటికి (27 మధ్యాహ్నం వేళకు) 78 మందికి మాత్రమే సాయం అందించారు. అంటే 78 వేలు మాత్రమే ఖర్చు కావాలి. కొందరు వెయ్యి రూపాయల సరుకులు కూడా తీసుకున్నట్లు లేదు అందువల్ల ఇఫ్పటికి 70 వేల మేరకే ఖర్చయింది.
పోనీ అలా అని దరఖాస్తు చేసుకోలేదా జనాలు అంటే ఇప్పటికి 23 వేలకు పైగా జనాలు దరఖాస్తు చేసుకున్నారు. మరి వీరందరినీ ఎప్పుడు స్క్రూట్నీ చేస్తారు? ఎప్పుడు సాయం అందిస్తారు? విజయ్ కు వున్న క్రేజ్, పరిచయాలతో రోజకు లక్ష అయినా డొనేషన్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన రోజుకు వెయ్యి మందికి అయినా ఇవ్వొచ్చు. కార్పస్ ఫండ్ అలాగే వుంటుంది.
ట్విట్టర్ లో హడావుడి రేంజ్ లో కానీ ఇచ్చే స్పీడు మాత్రం కనిపించడం లేదు. అవసరం లో వున్న వాళ్లకు ఎంత త్వరగా సాయం చేస్తే అంత మంచింది.