ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విజయశాంతికి దండం పెట్టేసి దూరంగా ఉంటున్నారు!

పాతికేళ్ల క్రితం స్టార్ హీరోలకి తానూ కూడా ఏమీ తీసిపోనని, వాళ్ళతో సమానంగా స్క్రీన్ టైం కావాలని పేచీ పెట్టేదని విజయశాంతి గురించి పత్రికలలో రాసేవారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకి వచ్చిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఒక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆమె కోసం నిర్మాత చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా ఆమె పారితోషికం ఎక్కువ అయింది. రీఎంట్రీ కాబట్టి అంత డిమాండ్ చేసి ఉండొచ్చు అనుకున్నారు. అయితే మళ్ళీ కలిసిన వారిని అంతకంటే ఎక్కువే అడుగుతోందట. సరిలేరు నీకెవ్వరుకి అంత మాస్ ఫాలోయింగ్ రావడానికి తానె ప్రధాన కారణం అనుకుంటోందట.

భారీ పారితోషికంతో పాటు తన పాత్ర నిడివి కూడా చాలా ఉండాలని డిమాండ్ చేస్తూ వుంటే ఎందుకొచ్చిందిలే అంటూ నిర్మాతలు అటు వెళ్లడం మానేశారట. అయితే తనకే నటించే ఆసక్తి లేదంటూ ఆమె పీఆర్ టీం ఎలివేషన్ ఇచ్చుకుంటోంది అనుకోండి. అది వేరే సంగతి.

Exit mobile version