బన్నీ దగ్గర చిరకాలం వుండి కథ కోసం కసరత్తు చేసి, చేసి ఆఖరికి వదిలేసారు. ఈ క్రమంలో రాజీపడి మరో కథకుడు వక్కంతం వంశీ తో కూడా కలిసి పని చేసారు. అయినా అవుట్ పుట్ రాలేదు. గ్యాంగ్ లీడర్ తరువాత సరైన కథతో సరైన ప్రాజెక్టు ఎక్కిద్దామని తెగ ప్రయత్నించారు. కానీ కథ కుదరలేదు.
ఓ మిడ్ రేంజ్ యంగ్ హీరోతో సినిమా చేయాలని మూడు కథలు చెప్పారట. అన్నింటికి నో అన్నదే ఆన్సర్ అయింది. ఆఖరికి దిల్ రాజు తన దగ్గర వున్న బివిఎస్ రవి కథను అందిస్తే, దాన్ని పట్టుకుని సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అది కూడా ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదని టాక్. నిజానికి వేరే వాళ్ల కథతో సినిమా చేయడం అన్నది విక్రమ్ కుమార్ కు ఇష్టం లేకపోయినా, సినిమాలు చేతిలోకి రాని పొజిషన్ లో తప్పని సరైందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మనం, 24 సినిమాల టైమ్ లో తరువాత సినిమా మహేష్ తోనే అంటూ టాక్ వుండేది. అలాంటి డైరక్టర్ అన్నీ తిరిగి మళ్లీ చైతన్య దగ్గరకు వచ్చేసాడు. అలాంటిది చైతన్య కూడా కథ విషయంలో ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఓడలు బళ్లు కావడం అంటే ఇదేనేమో?