Advertisement

ఆ సినిమా ప్లాప్ తో ‘విక్రమ్’ కు పెంచారట!

Posted : June 9, 2022 at 6:43 pm IST by ManaTeluguMovies

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘విక్రమ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తమిళం మరియు తెలుగు వర్షన్ ల్లో భారీ వసూళ్లను దక్కించుకుంటున్న విక్రమ్ సినిమా మెల్లగా హిందీ వర్షన్ లో కూడా పుంజుకుంటుంది. విక్రమ్ కు పోటీ అన్నట్లుగా హిందీలో పృథ్వీరాజ్ విడుదల అయ్యింది.

అక్షయ్ కుమార్ నటించిన సినిమా అవ్వడంతో బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. అత్యధిక థియేటర్లలో ఆ సినిమానే విడుదల చేయడంతో విక్రమ్ సినిమా హిందీ వర్షన్ కు ఎక్కువ థియేటర్లు లభ్యం కాలేదు. ఇప్పుడు పృథ్వీరాజ్ సినిమా ప్లాప్ టాక్ దక్కించుకుంది. దాంతో రెండవ వారంకు చాలా థియేటర్ల నుండి పృథ్వీరాజ్ ను తొలగించబోతున్నారు. ఇప్పుడు ఆ థియేటర్లలో విక్రమ్ ను విడుదల చేయబోతున్నారు.

పృథ్వీరాజ్ ప్లాప్ అవ్వడంతో విక్రమ్ సినిమా కు ఉత్తర భారతంలో కలిసి వచ్చింది. ఇప్పటికే విడుదల అయిన చాలా చోట్ల మంచి వసూళ్లను విక్రమ్ దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

రెండవ వారంలో మరిన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కూడా సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమల్ హాసన్ కు చాలా సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ను కట్టబెట్టింది. అద్బుతమైన విక్రమ్ సినిమాకు తమిళ సినీ జనాలు నిరాజనాలు పడుతున్నారు. మేజర్ సినిమా పోటీ ఉన్నా కూడా విక్రమ్ సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లను మొత్తం దేశ వ్యాప్తంగా రాబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో కేవలం కమల్ హాసన్ మాత్రమే కాకుండా మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ మరియు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించిన విషయం తెల్సిందే. ఈ ముగ్గురు కాకుండా చివరి అయిదు నిమిషాల్లో తమిళ స్టార్ హీరో సూర్య కూడా రోలెక్స్ గా సందడి చేశాడు. మొత్తానికి ఒక ఫుల్ ప్యాక్ మల్టీ స్టారర్ మూవీగా విక్రమ్ నిలిచి.. సూపర్ హిట్ టాక్ దక్కించుకుని ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.


Advertisement

Recent Random Post:

Ongole : స్టేషన్ కు బాలినేని | Face to Face with Balineni Srinivas Reddy | YCP

Posted : April 12, 2024 at 6:45 pm IST by ManaTeluguMovies

Ongole : స్టేషన్ కు బాలినేని | Face to Face with Balineni Srinivas Reddy | YCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement