ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య కూడా 5 నిమిషాల పాత్ర పోషించారు. ఇలా ఇంత మంది స్టార్లు సినిమాలో భాగమవ్వండంతో కాస్టింగ్ ఖర్చు కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. కమల్ తో పాటు..విజయ్..పహద్ లాంటి నటులకు భారీగానే వెచ్చించి ఉంటారు. ఒక్కొక్కరు కోట్లలో పారితోషికం తీసుకుని ఉంటారు. మరి ఆ లెక్కన సూర్య పారితోషికం ఎంత? ఆయన ఎన్ని కోట్లు ఛార్జ్ చేసి ఉంటారు? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
ఈ సినిమా కోసం సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుట. కమల్ తో నటించడమే కోట్ల రూపాయల పారితోషికంగా భావించి డబ్బులు ఇస్తామన్నా! వద్దన్నారుట. కమల్ తో నటించాలన్న కోరిక సూర్యకి ఈ సిసినిమాతో తీరడంతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. కమల్ మీద గౌరవంతో..అభిమానంతో నిర్మాతలు పారితోషికం ఇవ్వబోతుంటే డబ్బు సంగతి అసలు ఎక్కడా చర్చించ వద్దని చెప్పి పంపించేసారుట.
అయితే సూర్య ‘విక్రమ్ -2′ లో ఇలా ప్రీగా నటించినా..’విక్రమ్ -3’ లో మాత్రం విలన్ పాత్ర కొట్టేసారని తెలుస్తోంది. విక్రమ్-3 లో కమల్ ని ఢీకొట్టడానికి సూర్యనే విలన్ గా ఎంపిక చేసారు. అందుకోసం మాత్రం భారీగానే పారితోషికం తీసుకునే అవకాశం ఉంది. ‘విక్రమ్-2’ పారితోషికం కూడా సూర్య ఇందులో యాడ్ చేసి మొత్తంగా వసూల్ చేస్తారేమో చూడాలి.
అదే జరిగితే వడ్డీ తో సహా లాగేసినట్లే. ‘విక్రమ్-3’ షూటింగ్ 2023 జూన్ తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ లోపు సూర్య తన సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకుని రెడీగా ఉంటే సరి.
సూర్య ప్రస్తుతం తన 41వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈచిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘ది నంబీ ఎఫెక్ట్’ అనే ఓ బయోగ్రాఫికల్ ల్లోనూ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు.