ఈ సందర్భంగా విష్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కళ్ల కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. కుమారుడిని కోల్పోయిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకున్నా కూడా నా హృదయం తల్లడిల్లుతోంది. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్” అన్నారు.