‘జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. గ్రీమీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎన్డీబీ సాయంతో 6400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టాం. 25 ఏళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. 9200 కి.మీ గ్రామీణ ప్రాంత రోడ్లను 1073 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా పనులు చేపడుతున్నాం. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేపట్టాం’.
‘దగదర్తి, భోగాపురం ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాం. 7015 కోట్లతో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. దేశంలో జరిగే ఎగుమతుల్లో 5.8 శాతం మేర ఏపీ నుంచే జరుగుతున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. నేరాల విచారణలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. మహిళలపై నేరాలను అరికట్టేందుకు దిశ యాప్ కీలకంగా మారింది. నవరత్నాల ద్వారా రాష్ట్రం ఆర్ధికాభివృద్ధి సాధిస్తోంది. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం. ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను వివిధ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు.