తమ చిత్రాన్ని జనాలల్లోని తీసుకెళ్లడానికి సరికొత్త ఐడియాలతో డిఫరెంట్ స్ట్రాటజీలతో వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఇవి బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన ఓ పని వల్ల ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.
కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కృషి చేస్తున్నాడు విశ్వక్. ఇప్పటి వరకు మాస్ అండ్ యూత్ ని ఆకట్టుకునేలా సినిమాలు చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా ”అశోకవనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాతో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు విశ్వక్ సేన్. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ హైదరాబాద్ లో నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు.
ఇటీవల కాలంలో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఐమాక్స్ థియేటర్ వద్ద రివ్యూలు అంటూ ఓ బ్యాచ్ మైక్ కనపడితే చాలు మీడియా ముందు ఓవర్ యాక్టింగ్ చేయడం చూస్తున్నాం. యూట్యూబ్ లో రకరకాల థంబ్ నెయిల్స్ తో ఈ వీడియోలు దర్శనమిస్తుంటాయి.
ఇప్పుడు విశ్వక్ సేన్ అలాంటి ఓవర్ యాక్టింగ్ చేసే ఓ యువకుడిని తన సినిమా ప్రమోషన్ కోసం తీసుకొచ్చారు. ఫిలింనగర్ రోడ్డులో విశ్వక్ వెళుతుండగా.. ఆ వ్యక్తి కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై న్యూసెన్స్ చేశాడు. దీంతో విశ్వక్ కారులో నుంచి దిగివచ్చి ఏమైందని అడుగుతాడు.
అల్లం అర్జున్ కుమార్ (అశోకవనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పాత్ర పేరు) కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు.. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను.. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుని నిప్పు అంటించుకుంటా అంటూ ఆ యువకుడు హల్ చల్ చేశాడు.
విశ్వక్ సేన్ కూడా ఇదేమీ తనకు తెలియనట్లు అక్కడ డ్రామా నడిపించాడు. ఈ వీడియోని సోషల్ మీడియా – యూట్యూబ్ లలో ప్రమోట్ చేశారు. అయితే తన సినిమా ప్రమోషన్ కోసం ఇలా నడిరోడ్డుపై ప్రాంక్ చేసిన హీరో విశ్వక్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
నడిరోడ్డు పై వీరిద్దరూ కలిసి చేసిన హంగామా వల్ల అక్కడి జనాలకు అసౌకర్యం కలిగిందని.. ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్ లో ప్రాంక్ లంటూ ఈ న్యూసెన్స్ ఏంటి? సినిమా ప్రచారం కోసం మరీ ఇంత దిగజారాలా? అని నెటిజన్లు విశ్వక్ పై ఫైర్ అవుతున్నారు.
నడిరోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు విశ్వక్ సేన్ మరియు ఆ యువకుడి పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్లలో భాగంగా చేసిన ప్రాంక్ వీడియోని హైదరాబాద్ పోలీస్ మరియు తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు హీరో విశ్వక్ సేన్ పై IPC 268 కింద కేసు పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ప్రమోషన్స్ పేరుతో ఈ పనికిమాలిన అతిని ప్రోత్సహిస్తూ.. ఇదే ప్రమోషన్ అనుకోవడం మేకర్స్ అమాయకత్వమే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి పోకడను డబ్బులిచ్చి పెంచి పోషించడం కంటే.. అదే శ్రద్ధ షూటింగులకు వెళ్లకముందు స్క్రిప్ట్ మీద పెడితే మంచిదని సూచిస్తున్నారు. కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా.. ఇలాంటి చెత్త పబ్లిసిటీనే నమ్ముకుంటే జనాలు థియేటర్లకు రావడం పక్కన పెడితే.. అనవసరంగా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.