కెరీర్ పరంగా ఫుల్ హ్యాపీగా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఎందుకు ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి కొన్ని గంటల ముందు కూడా చిత్ర ఒక సీరియల్ షూటింగ్ లో పాల్గొంది. అర్థ రాత్రి దాటే వరకు ఆ షూటింగ్ లో పాల్గొన్న చిత్ర ఆ తర్వాత హోటల్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఆమెకు ఎవరితో అయితే నిశ్చితార్థం అయ్యిందో ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.