ఇక శాటిలైట్ రైట్స్ ను 10 కోట్ల రూపాయలకు గాను అమ్మేయడం జరిగింది. మొత్తంగా ఈ సినిమా 38 కోట్ల వరకు బిజినెస్ చేసింది. పాతిక కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. నాగార్జు పారితోషికం కాకుండా ఈ సినిమా కు ఖర్చు చేసింది తక్కువే. కనుక నెట్ ఫ్లిక్స్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తంతో యూనిట్ సభ్యులు చాలా ఆనందంగానే ఉన్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమాకు సల్మాన్ రాజ్ దర్శకత్వం వహించగా నిరంజన్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం నాగ్ చాలా కష్టపడ్డట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తి అయిన వైల్డ్ డాగ్ సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.