ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా డోన్ట్‌ కేర్‌.. వైసీపీ నేత లిక్కర్‌ దందా.!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని దశలవారీగా నియంత్రించి, చివరికి పూర్తిస్థాయిలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారు. అధికారంలోకి వస్తూనే బెల్టు షాపుల్ని తొలగించినట్లు చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. కొత్త మద్యం పాలసీ.. అంటూ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరోపక్క, పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమ మద్యం ఏరులై పారుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తు, అధికార పార్టీ నేతల అక్రమ మద్యం దందా ఇంకో ఎత్తు. తాజాగా వైసీపీ నేత ఇంట్లో 1200 మద్యం సీసాలు బయటపడ్డాయి. పోలీసులు సోదాలు నిర్వహించడంతో వైసీపీ నేత శ్రీనివాస్‌రెడ్డి ‘మద్యం బాగోతం’ బయటపడింది. కర్నాటక నుంచి ఈ మద్యాన్ని శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అన్నట్టు, సదరు శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగాడు. బరిలోకి దిగడమేంటి.? ప్రత్యర్థుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి.. అసలంటూ ప్రత్యర్థులే లేకుండా చేసుకుని.. చివరికి ఏకగ్రీవంగా గెలిచాడు కూడా. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్‌ డాష్‌ అన్నట్లుంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఈ ఘటన జరిగింది.

దొరికినోడు ఒక్కడే.. దొరకని ‘మద్యం దొరలు’ ఇంకెతమంది వున్నారోగానీ.. ఈ ఘటనపై స్పందించడానికి మాత్రం వైసీపీ నేతలు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతే మరి, తేలు కుట్టిన దొంగల్లా తయారైందిప్పుడు పరిస్థితి. అయినా ఓ వైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంటే.. వైసీపీ నేతకి ఈ లిక్కర్ కక్కుర్తి ఏంటబ్బా.?

Exit mobile version