పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పలు కాలనీలకు చెందిన వాసులు హఠాత్తుగా అనారోగ్యం పాలవ్వడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 350 మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఒకరు మృతి చెందినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కొందరు తిరిగి మామూలు అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వందల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కళ్లు తిరగడం.. నోటి వెంట నురగ రావడం.. మూర్చ పోవడం వంటి లక్షణాలతో రోగులు ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యారు. వారిని పరామర్శించేందుకు సీఎం జగన్ ఉదయం ఏలూరు వెళ్లారు.
అక్కడ ఆసుపత్రిలో పలువరిని పలకరించి వారి ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్న సీఎం జగన్ అక్కడ వైధ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత పలు విభాగాల అభికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులు ప్రతి ఒక్కరికి సాయం గా నిలవాలంటూ సీఎం ఆదేశించారు. నిన్న రాత్రి నుండి ఉదయం వరకు 28 మంది కొత్తగా ఇవే లక్షణాలతో ఆసుపత్రిలో వచ్చి జాయిన్ అయ్యారు. నేడు సాయంత్రం వరకు కేంద్రం బృందం వచ్చి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.