ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అనంతపురంలో మూడు కొత్త రిజర్వాయర్లు

కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురంను జలమయం చేస్తామంటూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మూడు కొత్త రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు శంకుస్తాపన చేశారు. నేడు వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా జగన్‌ ఆ మూడు ప్రాజెక్ట్‌లకు అంకురార్పణ చేశారు. ఈ మూడు రిజర్వాయర్లతో అనంతపురం జిల్లా నీటితో కళకళలాడుతుందని అన్నారు. రాప్తాడు నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను ఈ రిజర్వాయర్లు పని చేస్తాయని అన్నారు.

సీఎం జగన్‌ తో పాటు మంత్రి అనీల్‌ కుమార్‌ కూడా ఈ శంకుస్తాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు హంద్రీనీవా నుండి పేరూరా డ్యాంకు నీటిని తరలించేందుకు ఉపయోగించబోతున్నట్లుగా ఈ సందర్బంగా జగన్‌ పేర్కొన్నారు. ఈ మూడు రిజర్వాయర్‌ ల వల్ల 7 మండలాల్లోని మొత్తం 35 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రిజర్వాయర్లు మరియు కాల్వల కోసం వెంటనే ఆర్థిక శాఖ నుండి రూ.800 కోట్లను విడుదల చేయిస్తున్నట్లుగా జగన్‌ పేర్కన్నాడు. రెండేళ్లలోనే ఈ రిజర్వాయర్‌ లను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version