ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎమ్మెల్యే రోజాకి సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకట్లేదా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఏ స్థాయిలో సేవలందిస్తున్నారో.. ఈ క్రమంలో ఎన్నెన్ని అవమానాల్ని ఆమె ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. టీడీపీ నుంచి బయటకు వచ్చి, వైఎస్ జగన్ వెంట నడవాలనే నిర్ణయం తీసుకున్నాక.. అప్నటినుంచి ఇప్పటిదాకా.. రోజా రాజకీయ ‘పోరాటం’ అలా అలా కొనసాగుతూనే వుంది. ఆ మాటకొస్తే టీడీపీలో వున్నప్పుడూ ఆమెకు స్వపక్షంలో విపక్షమే.. ఇప్పుడూ ఆమెకు స్వపక్షంలో విపక్షమే.!

గత కొంతకాలంగా ఎమ్మెల్యే రోజా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పెద్ద యజ్ఞమే చేస్తున్నారట. అయినాగానీ, అపాయింట్మెంట్ దొరకడంలేదట. నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నాయకుల్లో కొందరు తనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టినా, తన పరువుని బజార్న పడేస్తున్నా.. ఆ విషయాన్ని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పుకోలేని దుస్థితి ఆమెది.

‘అబ్బే, ఆల్ ఈజ్ వెల్..’ అని కూడా అనుకోవడంలేదామె.. పోరాడుతూనే వున్నారు, పార్టీలో తన పరువు ప్రతిష్టల్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్రంగా వైసీపీ అధినాయకత్వం కూడా చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోంది.

తాజాగా, తన నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ పేరుతో ఏర్పడే జిల్లాలో వుంచాలనే డిమాండ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాలనుకుంటున్నారట రోజా. అదే సమయంలో, మంత్రి పదవి విషయమై భరోసా కోరుకుంటున్నారామె. ఇంతకీ, అధినేత నుంచి రోజాకి అపాయింట్మెంట్ దొరుకుతుందా.? అంటే, అవకాశాలు తక్కువేనని వైసీపీ అనుకూల మీడియానే తెగేసి చెబుతోంది.

అదేంటీ, వైసీపీలో అత్యంత కీలకమైన మహిళా నేత.. పైగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైనా రోజాకి ఎందుకు ఇంత పెద్ద కష్టమొచ్చింది.? అదే మరి, రాజకీయమంటే.ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఏ స్థాయిలో సేవలందిస్తున్నారో.. ఈ క్రమంలో ఎన్నెన్ని అవమానాల్ని ఆమె ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. టీడీపీ నుంచి బయటకు వచ్చి, వైఎస్ జగన్ వెంట నడవాలనే నిర్ణయం తీసుకున్నాక.. అప్నటినుంచి ఇప్పటిదాకా.. రోజా రాజకీయ ‘పోరాటం’ అలా అలా కొనసాగుతూనే వుంది. ఆ మాటకొస్తే టీడీపీలో వున్నప్పుడూ ఆమెకు స్వపక్షంలో విపక్షమే.. ఇప్పుడూ ఆమెకు స్వపక్షంలో విపక్షమే.!

గత కొంతకాలంగా ఎమ్మెల్యే రోజా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పెద్ద యజ్ఞమే చేస్తున్నారట. అయినాగానీ, అపాయింట్మెంట్ దొరకడంలేదట. నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నాయకుల్లో కొందరు తనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టినా, తన పరువుని బజార్న పడేస్తున్నా.. ఆ విషయాన్ని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పుకోలేని దుస్థితి ఆమెది.

‘అబ్బే, ఆల్ ఈజ్ వెల్..’ అని కూడా అనుకోవడంలేదామె.. పోరాడుతూనే వున్నారు, పార్టీలో తన పరువు ప్రతిష్టల్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్రంగా వైసీపీ అధినాయకత్వం కూడా చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోంది.

తాజాగా, తన నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ పేరుతో ఏర్పడే జిల్లాలో వుంచాలనే డిమాండ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాలనుకుంటున్నారట రోజా. అదే సమయంలో, మంత్రి పదవి విషయమై భరోసా కోరుకుంటున్నారామె. ఇంతకీ, అధినేత నుంచి రోజాకి అపాయింట్మెంట్ దొరుకుతుందా.? అంటే, అవకాశాలు తక్కువేనని వైసీపీ అనుకూల మీడియానే తెగేసి చెబుతోంది.

అదేంటీ, వైసీపీలో అత్యంత కీలకమైన మహిళా నేత.. పైగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైనా రోజాకి ఎందుకు ఇంత పెద్ద కష్టమొచ్చింది.? అదే మరి, రాజకీయమంటే.

Exit mobile version