ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జగనన్న చెప్తాడంతే.! చెప్పాడంటే, చెయ్యడంతే.!

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ని వంచారా.? లేదాయె.! పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశారా.? లేదాయె.! రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు చేశారా.? చెయ్యరాయె.! కడప స్టీలు ప్లాంటు కట్టి తీరతామన్నారు.. కట్టారా.? కట్టరాయె.! ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే చాలానే.

పోనీ, పైవన్నీ కేంద్రం చేయాల్సిన పనులే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలి కదా.? ఆయా అంశాల్ని అడ్డంగా చూపి, చట్ట సభల్లో కేంద్రాన్ని నిలదీయాలి కదా.? ఆయా బిల్లుల ఆమోదం సమయంలో పార్లమెంటులో వైసీపీ, కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడెయ్యాలి కదా.? కానీ, అవేమీ చెయ్యరంతే.

పోనీ, ముఖ్యమంత్రి చేతిలోని విషయం.. ఒక్క సంతకంతో సీపీఎస్ రద్దు చేసేస్తామన్నారు కదా.? కానీ, చెయ్యలేదెందుకు.? అంతే, జగనన్న చెప్తాడంతే.. చెప్పాడంటే చెయ్యడంతే.. అని అర్థం చేసుకోవాలేమో.!

2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొత్త హామీలు ఏమిద్దాం.? అన్నదానిపై కసరత్తులు కూడా షురూ అయ్యాయట. అవుతాయ్, అయి తీరాలి కూడా.

గత ఎన్నికల్లో నవరత్నాలన్నారు. ఇప్పుడు ఏం కొత్త కథ చెబుతారట.? ఏమో, ఏం చెప్పినాసరే, రాష్ట్రం మీద అప్పుల భారాన్ని రెండింతలో, నాలుగింతలో చెయ్యడం తప్ప, రాష్ట్రం మీద ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని మాత్రం ఎన్నికల హామీ ఇచ్చే ప్రసక్తే వుండదు.

అప్పు చేసి పప్పు కూడు.. అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడేమో, అప్పు చేసి సంక్షేమ కూడు.! అనుకోవాలేమో. అప్పులు చేయడం ద్వారా నడిచే సంక్షేమ పథకాల్ని ఎవడన్నా సంక్షేమం అంటారా.? జగనన్న ‘వాత’ అని పేరు పెట్టుకుంటే బావుంటుందన్నది విపక్షాల విమర్శ. దీనికి వైసీపీ ఏం సమాధానమిస్తుందో ఏమో.!

Exit mobile version