ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జస్ట్ ఆస్కింగ్: రాజకీయాల్లోకి వచ్చింది వెంట్రుకలు పీకించుకోవడానికా.?

తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.? అన్నట్టు, వైసీపీలో అందరిదీ ఒకటే తీరు. వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ తాజాగా, ‘నీ యమ్మ మొగుడు..’ (రాయడానికి అత్యంత అసభ్యకరంగా వున్నా.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక భాషలా తగలడింది మరి) అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ మీద విరుచుకుపడ్డ విషయం విదితమే.

ఈ పరమ పవిత్రమైన వైసీపీ అధికార భాషని బాగా వల్లించడంలో తాజా మాజీ మంత్రి కొడాలి నానికి మించినోళ్ళు ఎవరుంటారు.? అసలు వాళ్ళలా ఎందుకు నోరు జారుతున్నారంటే, ఇదిగో.. ఇదే కారణమంటూ.. అసలు విషయాన్ని పరోక్షంగా బయటపెట్టేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

తాజాగా నంద్యాలలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వందలాది మంది, వేలాది మంది జనం సాక్షిగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు వైఎస్ జగన్. ఇదెక్కడి పైత్యం.? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారంటే, వైఎస్ జగన్ వాడిన పదజాలం అలాంటిది మరి.

రాజకీయాల్లో కింది స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడకూడని మాటని పెద్ద పెద్ద పొజిషన్లో వున్నవాళ్ళు మాట్లాడేస్తున్నారు. మంత్రులు తమ స్థాయిని ఏనాడో మర్చిపోయారు. ముఖ్యమంత్రి సైతం, తానేం తక్కువ తిన్లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.

అయినా, రాజకీయాల్లోకి వచ్చింది వెంట్రుకలు పీకించుకోవడానికా.? 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తెరగాలి. అయినా, నూటికి నూరు శాతం మంది ఓట్లేస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవకూడదని ఓటేసినోళ్ళూ దాదాపు సగం మంది వున్నారు.

తన మాటల్ని మహిళలు, చిన్న పిల్లలు సైతం వింటున్నారన్న విషయాన్నీ, లక్షలాది మంది టీవీ సెట్లలో తిలకిస్తున్నారనీ ఆలోచించకుండా.. ‘వెంట్రుకల’ ప్రస్తావన తీసుకొచ్చి వైఎస్ జగన్ తన స్థాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తన కుర్చీని తానే విరగ్గొట్టుకుంటున్నారు వైఎస్ జగన్.

Exit mobile version