ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైఎస్ జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

వైఎస్ జగన్ ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ తమ పార్టీ రంగులను వేయించింది. ఆ తర్వాత ఈ విషయంపై హై కోర్టు ఉన్నపళంగా రంగులను మార్చాలని ఆర్డర్లు పాస్ చేసింది. కానీ ఏపీ సర్కార్ రంగులను మార్చకుండా దానికి బిజెపికి సంబందించిన మరో రంగును జతచేసి హై కోర్టుకు సబ్మిట్ చేసింది. కానీ దానిని కూడా హైకోర్టు కొట్టేస్తూ రంగులు మార్చాల్సిందే అంటూ ఆర్డర్స్ ఇచ్చింది.

ఈ ఆర్డర్స్ ని ధిక్కరిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. నేడు పూర్తి విచారణ ముగియడంతో సుప్రీం కోర్టు రంగుల రాజకీయానికి చెక్ పెడుతూ వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులు వెంటనే తొలగించాలని, అందుకు 4 వారాల టైం కేటాయించింది. 4 వారాల్లో రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది.

Exit mobile version