ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైఎస్ జగన్ కేబినెట్ ఆమోదించిన కీలక పథకాల లిస్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మంత్రులందరితో గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రానున్న నాలుగేళ్లలో ఈ చేయూత పథకం కింద 18 – 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

ఇలా ఏపీ కేబినెట్ ఏయే విషయాలకు ఆమోద ముద్ర వేసిందనే లిస్ట్..

> 45 – 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 75 వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని, అందులో ప్రతి ఏడాది రూ.18,142లు వారికి చేరేలా చేస్తారు. 24 నుంచి 26 లక్షలమంది లబ్ధిదారులు ఉన్న ఈ పథకాన్ని ఆగస్టు 12న లాంచ్ చేయనున్నారు.

> టీటీడీ దేవాలయంలో సన్నిధి గొల్లకు వారసత్వ హక్కు కలిపిస్తూ నిర్ణ్యం తీసుకున్నారు.

> భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజక్ట్ లో ఎలాంటి మార్పు లేకుండా 500 ఎకరాలు తగ్గించే నిర్మాణ పనులు చేపడతారు. ఆ 500 ఎకరాలు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.

> గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా,ఫైబర్ నెట్,చంద్రన్న కానుక, క్రిస్మస్ కానుక, హెరిటేజ్ సరకుల సరఫరా, సెటాప్ బాక్సుల విషయంలో జరిగిన 150 కోట్ల అవినీతిపై నివేదిక సమర్పించిన కేబినెట్ సబ్ కమిటీ.త్వరలో సీబీఐ దర్యాప్తు చేసే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

> జగనన్న తోడు పథకం పేరిట చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు. అక్టోబర్ నుంచీ ఈ పథకం అమలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

> వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల కోసం రూ. 1,863 కోట్లకు ఆమోదం తెలిపింది.

> ప్రభుత్వ ఇళ్ళ స్థలాలు, ఇల్లు అమ్ముకునేందుకు 5 ఏళ్ల తర్వాత హక్కు కల్పించింది.

> గ్రే హౌండ్స్ కోసం విశాఖలో భూమిని ఉచితంగా ఇవ్వనుంది.

> JNTU కాకినాడ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం

> తెలుగు, సంస్కృత అకాడమీలు తిరుపతిలో ఏర్పాటు చేయనున్నారు.

> జగనన్న విద్య దీవెన పథకంలో భాగంగా 4 విడతల్లో తల్లుల అకౌంట్ లోకి రానున్న నగదు.

> సోలార్ పవర్ యూనిట్ స్థాపనకు పరిపాలన పరమైన ఆమోదం

> ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం జరగనుంది. అందులో భాగంగా మొదటి దశలో రూ. 4736 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జరుగుతాయని, ఆగష్టులో టెండర్లు పిలవాలని సూచన.

> గండికోట రిజర్వాయర్ లో పూర్తి సామర్ధ్యం కోసం అర్ & అర్, మరియు వెలిగొండ అర్ & అర్ కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

> ప్రభుత్వానికి ఎగ్గొట్టే పన్నులను గాడిలో పెట్టడం కోసం ఏపీ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి అందులో 55 పోస్ట్ లు మంజూరు చేసింది.

Exit mobile version