కర్నూలు జిల్లాలో 13 ఏళ్ల క్రితం ఆస్పరి, చిన్న హోతూరు, పెద్ద హోతూరు, మరకట్టు గ్రామాలకు చెందిన 450 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం ఇత్తిన ప్లాంటేషన్‌కు ప్రభుత్వం తక్కువ రేటుకు భూమిని ఇవ్వడం జరిగింది. రైతులకు అతి తక్కువ నష్టపరిహారం ఇవ్వడంతో గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి కంపెనీ ఏర్పాటు చేయలేదు. పైగా ఆ భూములు మంత్రి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయ్యింది. కంపెనీలు ఏర్పాటు చేయకుంటే వెంటనే రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
కాని ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి పరిష్కారం చూపించక పోవడంతో పాటు అధికారులు కొందరు మంత్రి కుటుంబ సభ్యులకు సహకరించి వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా రామకృష్ణ సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.