ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు.

వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కిందవెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరారు.

వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు.

Exit mobile version