ఆన్ లైన్ గేమింగ్స్ మరియు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వల్ల పెద్ద ఎత్తున సామాన్యులు బలి అవుతున్నారు. ఎంతో మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో ఏపీలో ఆన్ లైన్ గ్యాబ్లింగ్ మరియు బెట్టింగ్ ను నిషేదిస్తూ వాటిపై బహిష్కరణ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ను సవరిస్తూ కీలక సవరణలు ఈసుకు రావడం జరిగింది. వాటిని వివరిస్తూ కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను గురించి ప్రస్థావిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు.
ఆ లేఖలో సీఎం జగన్.. ఆన్ లైన్ గేమింగ్,బెట్టింగ్ మరియు గ్యాబ్లింగ్‌లను కేంద్రం అధికారికంగా బ్యాన్ చేయాలి. అలాంటి యాప్ లకు మరియు వెబ్ సైట్లకు ఇంటర్నెట్ ప్రొవైడర్లు బ్యాన్ చేయాలని కోరాడు. ఏపీలో ఆయా సైట్లను యాప్ లను బ్యాన్ చేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించాలంటూ కేంద్ర మంత్రికి జగన్ విజ్ఞప్తి చేశారు. తాము తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు చట్ట రూపం ఇచ్చేందుకు గాను గెజిట్ విడుదల చేయాలని కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నాడు. సీఎం లేఖకు మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.