‘రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు.. యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు.. డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు.. ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి. మేఘా కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి. కమిషన్లకు కక్కుర్తిపడి అక్కరకురాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేసారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.