ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైఎస్ షర్మిల ఏపీలో ‘దీక్ష’ చేస్తే.. అనుమతిస్తారా.?

తెలంగాణకీ, ఆంధ్రప్రదేశ్‌కీ ‘తేడా’ ఏంటో స్పష్టంగా నిన్ననే అర్థమయ్యింది చాలామందికి. ఏపీలో రాజకీయాలెలా వున్నాయ్.? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయ్.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేసింది. తెలంగాణలో విపక్షాలు గొంతు విప్పడానికి అవకాశం వుంది. ప్రజల తరఫున నిలబడేందుకూ అవకాశముంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదు.

గుంటూరులో ఓ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడో మృగాడు. నిందితుడ్ని పోలీసులు తక్కువ సమయంలోనే అరెస్ట్ చేశారనుకోండి.. అది వేరే విషయం. విపక్షాలు, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే, పోలీసులు నానా రకాల ఆంక్షలూ విధించడం.. పరామర్శకు వెళ్ళిన విపక్ష నేతలపై కేసులు పెట్టడం చూశాం. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.

చిన్నారి చైత్రపై హత్యాచారం ఘటనకు సంబంధించి విపక్షాలు, బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. అలా పరామర్శించిన పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా వుంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే, చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలంటూ దీక్షకు కూడా దిగారు. మరి, షర్మిల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దీక్ష చేయగలరా.?

తెలంగాణలో దిశ ఘటన జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ఎందుకు వేగంగా స్పందించలేకపోతోందన్న విమర్శలున్నాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడెందుకు ఏపీలో ప్రజా సమస్యలపై స్పందించడంలేదు.?

తెలంగాణలో దీక్ష చేశారు సరే, తన సోదరుడే ముఖ్యమంత్రిగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రజల తరఫున ఎందుకు గళం విప్పలేకపోతున్నారు.? ఒకవేళ షర్మిల గనుక, ఏపీలో ఏదన్నా సమస్య మీద దీక్షలు చేస్తామంటే, వైఎస్ జగన్ సర్కార్ అనుమతిస్తుందా.? ఇలా చాలా ప్రశ్నలు జగన్ సర్కార్ మీదకు దూసుకెళుతున్నాయి. ‘మేం తెలంగాణకే పరిమితమయ్యాం..’ అన్న ఒక్క మాటతో వైఎస్ షర్మిల, బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారుగానీ.. ప్రజలకి అన్నీ అర్థమవుతున్నాయ్.

Exit mobile version