Advertisement

‘నారప్ప’కు మార్పులు చేర్పులు

Posted : April 16, 2021 at 9:45 pm IST by ManaTeluguMovies

తమిళ హిట్‌ మూవీ అసురన్‌ కు రీమేక్ గా రూపొందుతున్న నారప్ప సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా ఉంటే మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సమయంలో సినిమా విడుదల కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఆలస్యం అవ్వబోతుంది. షూటింగ్‌ పూర్తి అయినా కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. కనుక మళ్లీ సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్‌ వర్క్‌ ను చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నారప్ప సినిమా షూటింగ్‌ ను మళ్లీ ప్రారంభించబోతున్నారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలను సురేష్‌ బాబు రీ షూట్‌ చేయాల్సిందిగా చెప్పాడట. దాంతో ప్రస్తుతం అడ్డాల రీ షెడ్యూల్‌ చేశాడని అంటున్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నారప్ప సినిమా షూటింగ్‌ మళ్లీ దాదాపుగా నెల రోజుల పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.


Advertisement

Recent Random Post:

BJP Counter To Congress : Rajnath Singh Hot Comments On Congress Party

Posted : April 25, 2024 at 12:03 pm IST by ManaTeluguMovies

BJP Counter To Congress : Rajnath Singh Hot Comments On Congress Party

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement