Advertisement

పూజ హెగ్డే ముందు అఖిల్ తోనే మొదలుపెట్టేసింది!

Posted : September 15, 2020 at 6:13 pm IST by ManaTeluguMovies

పూజ హెగ్డే నిన్న హైదరాబాద్ చేరుకున్న విషయం తెల్సిందే. నిన్న హైదరాబాద్ విమానాశ్రయంలో పూజ హెగ్డే దర్శనమిచ్చింది. దీంతో ప్రభాస్ సినిమా షూటింగ్ ఈ వారం మొదలవుతుందన్నారు కాబట్టి ఆ షూటింగ్ కోసం పూజ హైదరాబాద్ వచ్చిందని అందరూ భావించారు. అయితే ఇందులో నిజమున్నా, పూజ హెగ్డే కేవలం ప్రభాస్ సినిమా కోసమే కాదు హైదరాబాద్ కు వచ్చింది.

అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో పూజాది స్టాండప్ కమెడియన్ పాత్ర. తెలుగు హీరోయిన్ల వరకూ చాలా కొత్త తరహా పాత్ర అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తి చేసుకుంది. ఈరోజు నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ తిరిగి అధికారికంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని పూజ హెగ్డే అధికారికంగా వెల్లడించింది. పీపీఈ కిట్స్ ధరించిన ఆమె పర్సనల్ స్టాఫ్ తో ఫోటోను పూజ పోస్ట్ చేసింది. వచ్చే నెల కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్బ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సంక్రాంతికి విడుదల కానుంది.


Advertisement

Recent Random Post:

YSRCP : అటు బస్సు యాత్ర.. ఇటు చేరికల మాత్ర | CM Jagan | Super Prime Time

Posted : April 20, 2024 at 9:39 pm IST by ManaTeluguMovies

YSRCP : అటు బస్సు యాత్ర.. ఇటు చేరికల మాత్ర | CM Jagan | Super Prime Time

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement