Advertisement

శ్రీకృష్ణ దేవరాయలుగా మెగా హీరో

Posted : November 16, 2020 at 4:35 pm IST by ManaTeluguMovies

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకు వెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. సక్సెస్‌ ప్లాప్‌ తో సంబంధం లేకుండా సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా విడుదల కోసం వెయిటింగ్‌. మరో వైపు దేవా కట్ట దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు వీరు పోట్ల దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రారంభం అయ్యేలా దర్శకుడు వీరు పోట్ల ఏర్పాట్లు చేస్తున్నాడట.

మూడు సంవత్సరాల క్రితమే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు వీరు పోట్లకు సాయి ధరమ్‌ తేజ్‌ డేట్లు ఇచ్చాడు. గతంలో ప్రామిస్‌ ఇచ్చిన కారణంగా ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరు పోట్ల దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అందుకు సంబంధంచిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

ఈతరం ప్రేక్షకులకు బాలకృష్ణ ఆధిత్య 369 సినిమాలో చేసిన శ్రీకృష్ణ దేవరాయ పాత్ర మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ ఆపాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ పాత్రకు ఎంత వరకు సాయి ధరమ్‌ తేజ్‌ న్యాయం చేస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా హీరోల్లో ఈతరంకు చెందిన వారు ఎవరు కూడా పౌరాణిక సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. మొదటిసారి తేజూ సిద్దం అయ్యాడు.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan , Chiranjeevi పై Posani Krishna Murali ఫైర్ | AP Elections 2024

Posted : April 23, 2024 at 11:36 am IST by ManaTeluguMovies

Pawan Kalyan , Chiranjeevi పై Posani Krishna Murali ఫైర్ | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement