Advertisement

గుణశేఖర్ శాకుంతలంగా కనిపించబోయేది ఎవరు?

Posted : January 1, 2021 at 9:59 pm IST by ManaTeluguMovies

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి తర్వాత దాదాపు ఐదేళ్లు విరామం తీసుకుని ప్రకటించిన సినిమా శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. గుణశేఖర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయాన్ని కూడా గుణశేఖర్ ప్రకటించాడు.

మహాభారతం ఆది పర్వంలోని ఒక భాగమైన శకుంతల కథను ఈ సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్నారు. విశ్వామిత్ర కుమార్తె శకుంతల, దుశ్యంతల మధ్య ప్రేమకథను ప్రధానంగా ఈ చిత్రంలో టచ్ చేయనున్నారు.

ఇక శాకుంతలంగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో నడిచిన కన్ఫ్యూజన్ కు నేటితో తెరపడింది. అధికారికంగా సమంతనే శాకుంతలం పాత్రలో నటించబోతోంది అని తెలిపారు. ముందు పూజ హెగ్డేను అనుకున్నా చివరికి సమంతకే గుణశేఖర్ ఓటు వేసాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

శాకుంతలం పూర్తి చేసిన తర్వాత గుణశేఖర్ రానా దగ్గుబాటి హీరోగా హిరణ్యకశ్యపను చేయాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

ఎలక్షన్ బరిలో ఉన్న కీలక నేతల ఆస్తులు ఎంత..! టాప్ టెన్ లో ఉన్న ధనవంతులు ఎవరు..? | Special Focus

Posted : April 26, 2024 at 2:17 pm IST by ManaTeluguMovies

ఎలక్షన్ బరిలో ఉన్న కీలక నేతల ఆస్తులు ఎంత..! టాప్ టెన్ లో ఉన్న ధనవంతులు ఎవరు..? | Special Focus

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement