Advertisement

సోహెల్‌ చేతిలో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌??

Posted : January 6, 2021 at 3:00 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 లో లక్కీ కంటెస్టెంట్‌ ఎవరు అంటే సోహెల్‌ అనడంలో సందేహం లేదు. నెం.3 గా నిలిచి ప్రైజ్‌ మనీలో సగం దక్కించుకున్నాడు. అదే సమయంలో చిరంజీవి వంటి స్టార్‌ తో నటించే అవకాశం పొందాడు. ఇంకా ఆయన అదృష్టం గురించి చెప్పనక్కర్లేదు. షో నుండి బయటకు వచ్చిన వారం రోజుల్లోనే రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికి అతడి వెంట నలుగురు అయిదుగురు నిర్మాతలు పడుతున్నారు. ఈ సమయంలో సోహెల్‌ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ది రోజ్‌ విల్లా అనే సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సోహెల్‌ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాత రామారావు అన్న నాకు ఆప్త మిత్రుడు. నేను బిగ్‌ బాస్ కు వెళ్లడానికి ముందు నాకు చాలా హెల్ప్‌ చేశాడు. అతడి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. అన్న నాకు బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్ లో నటించే అవకాశం కూడా ఇప్పించాడంటూ సోహెల్‌ చెప్పుకొచ్చాడు. హిందీ వెబ్‌ సిరీస్ లో నటించబోతున్నట్లుగా సోహెల్‌ ప్రకటించడంతో ఆయన ఎంత బిజీగా ఉన్నాడో అర్థం అవుతుంది.


Advertisement

Recent Random Post:

లోకల్ to గ్లోబల్ : వీడిన అఖిలప్రియ గుట్టు

Posted : January 12, 2021 at 12:45 pm IST by ManaTeluguMovies

లోకల్ to గ్లోబల్ : వీడిన అఖిలప్రియ గుట్టు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement