Advertisement

అఖిల్ చేసేది నాగ్ కథేనా..?

Posted : October 21, 2024 at 2:47 pm IST by ManaTeluguMovies

అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్లు అందుకుని సత్తా చాటగా.. ఒక్కరు మాత్రం చాలా కాలం పాటు సక్సెస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడే హ్యాండ్సమ్ హీరో అఖిల్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ కొట్టిన అతడు.. ‘ఏంజెంట్’తో నిరాశ పరిచాడు. దీంతో అప్పటి నుంచి బ్రేక్‌లోనే ఉండిపోయాడు.

బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని అఖిల్.. ఇప్పటి వరకూ తన కొత్త సినిమాను ప్రకటించలేదు. కానీ, దీనిపై సమాచారం అయితే బయటకు వచ్చేసింది. ఈ యంగ్ హీరో ఇప్పటికే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేం మురళీ కృష్ణతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని కూడా తెలిసింది.

అక్కినేని అఖిల్ నటించబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ గురించి కూడా ఓ న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రం తిరుపతి బ్యాగ్‌డ్రాప్‌తో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతుందట. ఈ వివరాలు రివీల్ అయినప్పటి నుంచీ ఈ సినిమా స్టోరీపై ఎన్నో రకాల ఊహాగానాలు కూడా ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ నటించబోయే కొత్త సినిమా కథ గురించి ప్రచారాలు జరుగుతోన్న సమయంలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. అక్కినేని నాగార్జున హీరోగా అప్పుడెప్పుడో వచ్చిన ‘గోవింద గోవింద’ సినిమా తరహాలోనే అఖిల్ సినిమా కూడా ఉండబోతుందట. ఫాంటసీ ఎలిమెంట్లతో తెరకెక్కనుందని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

కింగ్ నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ‘గోవింద గోవింద’ మూవీ సైతం తిరుపతి బ్యాగ్‌డ్రాప్‌తోనే వచ్చింది. అందులో వర్మ తనదైన శైలిలో ఫాంటసీ సీన్స్ యాడ్ చేసి డిఫరెంట్ సబ్జెక్టుగా మార్చారు. తిరుమల దేవాలయం, అందులోని శ్రీవారి ఆభరణాలు, విగ్రహం నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పుడు అఖిల్ నటించే సినిమా కూడా ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ వార్త తెలిసిన వాళ్లంతా అఖిల్ చేసేది నాగార్జున సినిమా రీమేకా అని అనుకుంటున్నారు. నిజానికి అది కాదని తెలుస్తోంది.

యువ దర్శకుడు మురళి పూర్తిగా కొత్త తరహా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్న అఖిల్.. కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో అతడి గెటప్, బాడీ లాంగ్వేజ్ పూర్తి డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేశారట. ఇందుకోసం ఈ అక్కినేని కుర్రాడు చాలా కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. ఇక, ఈ మూవీ ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రానుందని తెలిసింది.


Advertisement

Recent Random Post:

Bloody Beggar – Official Trailer | Kavin | Nelson Dilipkumar | Sivabalan Muthukumar | Jen Martin

Posted : October 18, 2024 at 9:46 pm IST by ManaTeluguMovies

Bloody Beggar – Official Trailer | Kavin | Nelson Dilipkumar | Sivabalan Muthukumar | Jen Martin

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad