Advertisement

అతనితో ఐకాన్ స్టార్.. డైలమా ఎందుకంటే..!

Posted : February 29, 2024 at 7:35 pm IST by ManaTeluguMovies

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటన్నది ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. పుష్ప 2 పూర్తి చేశాక అల్లు అర్జున్ అసలైతే త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే దాకా డౌట్ అంటున్నారు. ఓ పక్క అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ హీరోకి తెలంగాణ మాండలికాన్ని వాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ ఫస్ట్ ఆప్షన్ త్రివిక్రం కాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అనేస్తున్నాడు. జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అట్లీ తన నెక్స్ట్ సినిమా అదే రేంజ్ రిజల్ట్ అందుకోవాలంటే నేషనల్ వైడ్ గా ఇమేజ్ ఉన్న హీరోని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అట్లీ అయితే తన మొదటి ఆప్షన్ లో అల్లు అర్జున్ ని పెట్టుకున్నాడట.

ఇప్పటికే బన్నీ కోసం ఒక కథ కూడా రెడీ చేశాడని టాక్. ఇక ఎటొచ్చి నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలన్నది అల్లు అర్జున్ చేతుల్లోనే ఉంది. అట్లీతో సినిమాకే అల్లు అర్జున్ మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తున్నా కథ విషయంలో ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉందని టాక్. అట్లీ కేవలం ఒక లైన్ మాత్రమే చెప్పగా ఫుల్ స్క్రిప్ట్ వస్తేనే కానీ క్లారిటీ వస్తుదని తెలుస్తుంది. త్రివిక్రమ్ కూడా అంతే బన్నీ సినిమా కేవలం లైన్ మాత్రమే రాసుకున్నారట.

ఆయన కూడా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయలేదు. అట్లీ విషయంలో ఇదే డైలమా కొనసాగుతుంది. సో ఈ ఇద్దరిలో బన్నీ ఫైనల్ గా ఎవరికి ఓటు వేస్తాడు అన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా బన్నీ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్టే అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని షాక్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఒకవేళ అది ఇది కాదు బన్నీ కూడా పుష్ప 3 చేశాకే మరోటి అనేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.


Advertisement

Recent Random Post:

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Posted : October 3, 2024 at 2:41 pm IST by ManaTeluguMovies

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad