Advertisement

అలియా ఎందుకు నో చెబుతుంది..?

Posted : November 2, 2023 at 8:32 pm IST by ManaTeluguMovies

RRRతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ ఆ సినిమాలో సీత పాత్రతో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఎలాంటి పాత్ర అయినా తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్న అలియా అవార్డులు రివార్డులతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. అయితే ట్రిపుల్ ఆర్ టైం లో తెలుగు సినిమాల్లో నటించడం పట్ల తమ ఆసక్తి గురించి చెప్పిన అలియా ఆ తర్వాత ఎందుకో ఇక్కడ అవకాశాలను అందుకోలేదు. అలియా దాకా అవకాశాలు వెళ్లలేదా లేదా ఆమే వచ్చిన సినిమాలను కాదన్నదా అన్నది తెలియదు కానీ అలియా మాత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఒక్క సినిమాకు కూడా వార్తల్లో రాలేదు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత బ్రహ్మాస్త్ర రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కోసం తెలుగులో మాట్లాడి ఇక్కడ ఆడియన్స్ ని ఆశ్చర్యపరచిన అలియా అవకాశాలు వస్తే ఇక్కడ సినిమాలు చేస్తా అన్నట్టుగానే మూమెంట్ చూపించింది. అలియా కి ఇక్కడ సినిమాలు చేయాలని ఉన్నా బాలీవుడ్ లో వరుస సినిమాలు ఆమెను ఫ్రీ టైం లేకుండా చేస్తున్నాయి. సౌత్ లో పాగా వేయాలనే పెద్ద ప్లానింగ్ తోనే రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సైన్ చేసిన అలియా ఆ సినిమాలో ఊహించినంత క్రేజ్ తెచ్చుకుంది.

అలియా మళ్లీ తెలుగులో నటించాలంటే మళ్లీ ఆర్.ఆర్.ఆర్ లాంటి కాంబో సెట్ అవ్వాలని అనుకుంటుంది. కొందరైతే ఎలాగు జక్కన్న ఆర్.ఆర్.ఆర్ లో చేసింది కాబట్టి నెక్స్ట్ మహేష్ తో చేస్తున్న సినిమాలో కూడా ఆమెను తీసుకుంటారని అంటున్నారు. ఆ వార్తల్లో ఎంత వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. అలియా భట్ మాత్రం సౌత్ సినిమాల పై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఈ ఇయర్ బాలీవుడ్ లో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కథ, హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు జిగ్రా అనే సినిమాలో నటిస్తుంది.

ఆ సినిమాకు నిర్మాతగా కూడా అలియా భట్ బాధ్యత మీద వేసుకుంది. కమర్షియల్ సినిమాలే కాదు తన అభినయంతో మెప్పించే ప్రత్యేకమైన ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా చేస్తూ ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సినీ ప్రియులను అలరిస్తూ వస్తుంది అమ్మడు. అందుకే అలియా అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా చెప్పుకుంటారు.


Advertisement

Recent Random Post:

Saaree Movie Teaser | A Tale of Passion, Love & Conflict | Giri Krishna Kamal | RGV Unleashed

Posted : September 16, 2024 at 5:56 pm IST by ManaTeluguMovies

Saaree Movie Teaser | A Tale of Passion, Love & Conflict | Giri Krishna Kamal | RGV Unleashed

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad