Advertisement

ఆ దెబ్బకు నాగశౌర్య బిగ్ కన్ఫ్యూజన్..

Posted : August 4, 2023 at 10:59 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. అయితే అందులో సక్సెస్ అందుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది యంగ్ హీరోస్ కు అస్సలు కలిసి రావట్లేదు. సరైన భారీ హిట్ దక్కట్లేదు. అలాంటి వారిలో లవర్ బాయ్ నాగ శౌర్య ఒకరు. గట్టి హిట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు. ‘

ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగశౌర్య… ఆ తర్వాత ‘ఛలో’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ హిట్ అందుకుని దాదాపు ఐదేళ్లు అవుతుంది. కానీ ఇంతవరకు మళ్లీ సక్సెస్ ను చూడలేదు ఆయన. ‘అశ్వద్ధామ’, ‘లక్ష్య’ అంటూ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. రీసెంట్ గా ‘రంగబలి’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో నాగశౌర్య ఎలాగైనా గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని సినీ ప్రియులు ఆశించారు. నాగశౌర్య కూడా అదే కాన్ఫిడెన్స్ తో కనిపించారు. ప్రమోషన్స్ లో సినిమా హిట్ పక్కా అన్న ధీమాతోనే కనిపించారు. కానీ ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. నాగశౌర్య అంచనాలను తారుమారు చేసింది. ఆయన కెరీర్ ను సందిగ్ధంలో పడేసింది.

ఫలితంగా తర్వాత ఎలాంటి కథతో రావాలో తెలీయక ఆయన సతమతమవుతున్నారని తెలిసింది. సైలైంట్ అయిపోయారట. ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా ఆయన సైన్ చేయలేదని తెలిసింది. ఎలాంటి కథతో వస్తే.. ఆడియెన్స్ ఆదరిస్తారా అనే ఆలోచనలో పడ్డారట. ఎలాగైనా ఈ సారి పక్కా స్క్రిప్ట్ తో సినీ ప్రియులను మెప్పించేలా రావాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

కానీ ఎలాంటి సినిమాతో ముందుకు రావాలో తెలీక కాస్త కన్ఫూజన్ లోనూ పడ్డారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఓ హీరో చేసే సినిమాలు వరుసగా ఫ్లాప్ లు అయితే.. ఆయన చేయబోయే కొత్త సినిమాలపై రోజు రోజుకీ అంచనాలు తగ్గుతుంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య చేయబోయే కొత్త సినిమాపై ఆయన కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఆయన ఈ సారి ఎంతో ఆచితూచి రావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Advertisement

Recent Random Post:

Hyderabad : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం

Posted : September 30, 2024 at 11:42 am IST by ManaTeluguMovies

Hyderabad : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad