Advertisement

ఆ బ్యూటీకిది గోల్డెన్ ఛాన్స్!

Posted : August 18, 2023 at 9:48 pm IST by ManaTeluguMovies

`లోఫ‌ర్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన దిశా ప‌టానీ సుప‌రిచిత‌మే. ఆ సినిమా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌న‌ప్ప‌టికీ అమ్మ‌డు బాలీవుడ్ కెళ్లి బిజీ అయిపోయింది. `ధోనీ`..`వెల్క‌మ్ న్యూయార్క్`..`భాగీ` లాంటి విజ‌యాల‌తో బాగానే ఫేమ‌స్ అయింది. దీంతో బాలీవుడ్ ప‌రంగా చూసుకుంటే కెరీర్ సాఫీగానే సాగిపోతుంది. ఈ నేప‌థ్యంలో బ్యూటీకి సౌత్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుకునే అవ‌కాశం మ‌రోసారి వ‌రించింది.

`ప్రాజెక్ట్ -కె`..`కంగువ` లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కీల‌క పాత్ర‌కి ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఎంతో మంది భామ మ‌ణులున్నా వారెవ్వ‌రికీ రాని అవ‌కాశం అమ్మ‌డికి ద‌క్కింది. ఆ రంక‌గా ల‌క్కీ అనే అనాలి. ఓ ర‌కంగా ఇది బంగారం లాంటి అవ‌కాశం. సూర్య స‌ర‌స‌న న‌టిస్తోన్న `కంగువ` ఏకంగా ప‌ది భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇదొక పిరియాడిక్ చిత్రం. సూర్య కెరీర్ లో నే తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. కోలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క సినిమా కూడా చేయ‌కుండానే దిశ ప‌టానీ అందుకున్న అవ‌కాశం ఇది. ఇదే ఓ గొప్ప అవ‌కాశం అనుకుంటే ఇంత‌కు మించిన సంచ‌ల‌న చిత్రం `ప్రాజెక్ట్ -కె` లో భాగ‌మ‌వ్వ‌డం. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే న‌టిస్తున్నా…సెకెండ్ లీడ్ లో దిశాప‌టానీ న‌టించడం విశేషం. ఇందులో సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో అమ్మ‌డు క‌నిపించ‌బోతుంది.

ఇలా ఒకేసారి త‌మిళ‌..తెలుగు బిగ ప్రాజెక్ట్ లో న‌టించ‌డంతోనే దిశ పేరు మార్కెట్ లో మారు మ్రోగిపోతుంది. అవి రిలీజ్ అయి హిట్ అయితే ఆమె రేంజ్ మ‌రోలా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. హీరోయిన్ గా పాన్ ఇండియాని షేక్ చేయ‌డం ఖాయం. ఇక బాలీవుడ్ లో `యోధ` అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.


Advertisement

Recent Random Post:

వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించిన Pawan Kalyan | Varahi Declaration

Posted : October 3, 2024 at 10:41 pm IST by ManaTeluguMovies

వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించిన Pawan Kalyan | Varahi Declaration

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad